పోలీసు అమరవీరుల స్మృతిలో రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల స్మృతిలో రక్తదాన శిబిరం

TBN LIVE
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసులు అమరవీరుల జ్ఞాపకార్థం గా గురువారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సిఐ కమలాకర్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  జడ్చర్ల ఇన్చార్జి కాల్వ రాంరెడ్డి లైన్స్ క్లబ్ స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తగా వచ్చినటువంటి తల సేమియా వ్యాధికి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గాను ఎక్కువ బ్లీడింగ్ పోయిన యాక్సిడెంట్ కేసులకు అత్యవసర సమయాలలో రక్తం అవసరం పడుతుంది. కాబట్టి ఈ శిబిరంలో రక్తదానం చేసేందుకు వచ్చిన జడ్చర్ల వాసులకు అదేవిధంగా వారి పోలీస్ సిబ్బందికి జడ్చర్ల డిజిటల్ మీడియా సెక్రెటరీ మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా బ్రెయిన్ డెడ్ అకస్మాత్ మరణం సంభవించిన వ్యక్తి యొక్క వేరే ఇతర వ్యక్తులకు కండ్లు కిడ్నీ వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అవయవ దానం చేయడంతో వారికి మేలు చేసేవారు అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!