తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తే యువత ఏదైనా సాధించగలరని, దానికి తానే ఉదాహరణ అని గ్రూప్-1లో డీఎస్పీగా ఎంపికైన దాసరి సౌమ్య అన్నారు. జడ్చర్ల మండలం లింగంపేటకు చెందిన సౌమ్యను ఆదివారం ఘనంగా గ్రామస్థులు సన్మానించారు. ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు నిరుత్సాహపరచకుండా, ఆత్మవిశ్వాసం కల్పిస్తే ఎన్నో విజయాలను సాధించవచ్చుని పేర్కొన్నారు
లింగంపేట్ గ్రామం గర్వకారణంగా నిలిచింది.గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసరి గిరివర్ధన్, సులోచన రాణి కుమార్తె దాసరి సౌమ్య రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మకంగా కావడం విశేషం. చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాన్ని కలగనుకున్న సౌమ్య, కష్టపడి చదువుతూ పట్టుదలతో ముందుకు సాగారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ
క్రమశిక్షణతో చదివిన ఫలితమే ఈ గొప్ప విజయం. సౌమ్య విజయంతో లింగంపేట్ గ్రామం, జడ్చర్ల మండలం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. "తన కృషితో, కట్టుదిట్టమైన శ్రమతో సాధించిన ఈ విజయాన్ని చూసి యువత ప్రేరణ పొందాలి" అని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ వర్గం, బంధువులు, స్నేహితులు అందరూ సౌమ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
