పర్యావరణహిత క్యాంపస్ ఏకో బజార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జడ్చర్ల ప్రభుత్వ బి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు

పర్యావరణహిత క్యాంపస్ ఏకో బజార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జడ్చర్ల ప్రభుత్వ బి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు

TBN LIVE
డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల ఎకోక్లబ్ మరియు భారత  పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ సహకారంతో సంయుక్తంగా నిర్వహించిన "క్యాంపస్ ఎకోబజార్" కార్యక్రమం శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో విజయవంతంగా విద్యార్థినీ విద్యార్థులు.పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి మరియు పర్యావరణహిత వ్యాపారాలను ప్రోత్సహించాలనే ముఖ్యోద్ధేశ్యంతో ఈ కార్య‌క్ర‌మం చేపట్టబడింది.ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీమతి మంజుల, ప్రిన్సిపాల్ డా. జి. సుకన్య, వైస్ ప్రిన్సిపాల్ డా. నర్మద, శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులు గా విచ్చేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి, ఐపీఎస్, డీఎస్పీ శ్రీ గిరిబాబు డిటిసి, సీఐ కమలాకర్, మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి మంజులా దేవి  తదితర అధికారులు విచ్చేసి వివిధ స్టాల్లను సందర్శించి విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను అభినందించారు.ఈ ఎకోబజార్‌లో మొత్తం 51 స్టాల్లు ఏర్పాటు చేయబడగా, సుమారు 1000  మంది సందర్శకులు పాల్గొన్నారు. గ్రీన్ ఫుడ్ స్టాల్స్, పునర్వినియోగ కళాత్మక నమూనాలు, పునరుత్పాదక శక్తి మోడల్స్, విద్యార్థుల స్టార్టప్‌లు, సంప్రదాయ ఉత్పత్తులు, సాంప్రదాయ పిండి వంటలు, ఫ్యాషన్ మరియు గృహోపకరణ ఉత్పత్తులు తదితర విభాగాలు ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రతి విభాగంలో ప్రతిభ చూపిన స్టాల్స్‌కు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు ప్రశంసాపత్రాలను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. తద్వారా విద్యార్థుల్లో పర్యావరణ సంబంధిత అవగాహన పెంపొందడంతో పాటు హరిత వ్యవస్థాపకతపై ఆసక్తి పెరగడం విశేషం.న్యాయ నిర్ణేతలు గా పట్టణానికి చెందిన టీచర్ లు బ్లెస్సి, శిల్ప, కిరణ్మయి లు పాల్గొన్నారు.
సమ్మర్ధవంతంగా నిర్వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి. సుకన్య, ఎకోక్లబ్ కన్వీనర్ శ్రీమతి ఇష్రత్ సుల్తానా మరియు సమన్వయకర్త డా. బి. సదాశివయ్యకు సందర్శకులు మరియు ముఖ్య అతిథులు అభినందనలు తెలిపారు.ఎకో క్లబ్ సభ్యులు మాధురి, రాజేశ్వరి, ప్రవీణ్, రాఘవేంద్ర రెడ్డి, లత,  విక్రమ్, వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం, అందరూ కలసి కట్టుగా పనిచేసి విజయవంతం చేసినందుకు కళాశాల ప్రిన్సిపాల్ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!