జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాక్యాలపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాక్యాలపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం

TBN LIVE
మంగళవారం జడ్చర్ల అంబేడ్కర్ కళాభవన్ లో నిర్వహించిన. మీడియా సమావేశంలో నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ప్రోగ్రాంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పై ఫ్యాక్షనిస్టు అనే పదానికి అర్థం చెప్పాలని బీసీ సంఘ నాయకులు అన్నారు. మీరు రాజకీయపరంగా విమర్శలు చేస్తే మేము అడిగే వాళ్ళం కాదు రాజకీయాలు కాకుండా మీ సొంత మాటలతో దుర్భాషాలు ఆడటం మంచిది కాదు అన్నారు. ఆయన మూడుసార్లు ఇదే జడ్చర్ల శాసనసభ వ్యక్తిగా ఎన్నికయ్యారు అది మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి కానీ మీరు అలా మాట్లాడడం సరికాదన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలకు బీసీ సంఘాల జాగృతి సేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మేము పుట్టినప్పటి నుండి ఎందరో ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు కానీ ఫ్యాక్షనిస్టు అనే పదం ఎక్కడ వినలేదు కనలేదు మా రాజకీయ అనుభవంలో ఏ పేపర్లో టీవీలో కూడా చూడలేదు అన్నారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లోకి పోవడం రావడం అనేది మీ వ్యక్తిగత నిర్ణయాలు మీ కన్నా బలమైన నాయకుడు వస్తున్నప్పుడు మీరు భయభ్రాంతులకు గురవుతున్నట్టు ఉన్నది అని అన్నారు. మీరే చెప్పిన విధంగా ఆయన గేటు దగ్గరికి పోయినప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నారు కదా అలా రాజకీయం మాట్లాడండి కానీ పార్టీ ఎవడి అబ్బ సొత్తు కాదు ప్రజల సేవ చేయడానికి అన్ని పార్టీలు పనిచేస్తాయి కానీ ఈ పార్టీ ఆ పార్టీ అంటూ ఏమీ ఉండదు ఆయన ఎన్ని పార్టీలు మారినా మీకు అనవసరం వ్యక్తిగతంగా మాట్లాడొద్దు మీరు ఏ పార్టీలు మారలేదా ఎమ్మెల్యే కూడా ఏ పార్టీ మారలేదా అన్నారు. మా బీసీ సామాజిక వ్యక్తిని అంటే ఎవరు పట్టించుకోరు అనుకున్నారా ఖబర్దార్ మీలాగా చిల్లర రాజకీయాలు ఎవరు చేయలేదు వ్యక్తిగత దూషణ చేయలేదు అన్నారు. మీరు మాట్లాడిన ఫ్యాక్షనిస్టు అనే పదానికి బి షరతుగా మీడియాపరంగా క్షమాపణలు చెప్పాలి లేదంటే మా ఎర్ర శేఖరన్న ఆగ్రహం కాదు ఇది యావత్ జడ్చర్ల నియోజకవర్గ ప్రజల ఆగ్రోషం ఇది 24 గంటల లోపు మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలి లేదంటే జడ్చర్ల మొత్తం బీసీ సంఘాలు బందుకు పిలుపునిస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!