జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కాలేజ్ గంగాపురం గ్రామంలో నిర్వహించిన ప్రొఫెసర్ జి సుకన్య

జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కాలేజ్ గంగాపురం గ్రామంలో నిర్వహించిన ప్రొఫెసర్ జి సుకన్య

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పరిధిలోని గంగాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ ఎన్ఎస్ఎస్ చైర్మన్ సుకన్య ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు గంగాపూర్ విలేజ్ , యూనిట్ 4 వి.వేను అర్జునవాడ ఈ సంవత్సరం చలికాలం రావడంతో ముఖ్యంగా ప్రజలలో అవగాహన పట్ల ఈ కార్యక్రమాన్ని బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కాలేజ్  విద్యార్థుల చేత  నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రారంభానికి గుర్తుగా ఏటా సెప్టెంబరు 24న 'జాతీయ సేవా పథకం' (National Service Scheme NSS Day) దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశాలతోపాటు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించే కార్యక్రమమే ఎన్ఎస్ఎస్. వ్యక్తులతో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం, సమాజ శ్రేయస్సు పట్ల బాధ్యతగా వ్యవహరించడం లాంటి వాటిపై ఇది దృష్టి సారిస్తుంది. విద్యార్థులను దేశసేవలో భాగస్వాములను చేయడం దీని ప్రధాన ఉద్దేశం.ఎన్ఎస్ఎస్ అనేది యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత ప్రభుత్వ కార్యక్రమం. సమాజ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.భారత ప్రభుత్వం ఏటా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జాతీయ సమైక్యతా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఇవి ఏడు రోజుల పాటు జరుగుతాయి. ప్రతి శిబిరంలో 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు చేపడతారు. ఇందులో శ్రమదానం (చెట్లు నాటడం, పాడైపోయిన రోడ్లు - ప్రభుత్వ భవనాలకు మరమ్మత్తులు చేయడం), రక్తదానం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ లాంటివి ఉంటాయి ఇలాంటి కార్యక్రమం గంగాపురం గ్రామంలో నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!