మన నెక్కొండ గ్రామంలోని శివాంజనేయ దేవాలయం దగ్గర వెలిసిన శ్రీ పోచమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దల సమక్షంలో చందాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు భక్తులు తమ వంతు విరాళాలను అందించి అమ్మవారి సేవలో భాగస్వాములయ్యారు.
గ్రామ ప్రజలందరూ ఈ పవిత్ర కార్యం కోసం తమ వంతు చందాలు (విరాళాలు) అందజేసి, ఆలయ నిర్మాణంలో పాలుపంచుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము.
ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం
వచ్చే మంగళవారం ఉదయం 8:00 గంటలకు అమ్మవారి గుడి పనులు ప్రారంభమౌతున్నాయి.
వచ్చే మంగళవారం ఉదయం 8:00 గంటలకు అమ్మవారి గుడి పనులు ప్రారంభమౌతున్నాయి.
గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామ ప్రజలందరూ కలిసి రాబోయే మంగళవారం ఉదయం 8 గంటలకు టెంపుల్ దగ్గరకు చేరుకొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన.
