జిల్లావ్యాప్తంగా 30 రోజులు పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డి జానకి వెల్లడి

జిల్లావ్యాప్తంగా 30 రోజులు పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డి జానకి వెల్లడి

TBN LIVE
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: జిల్లా యస్.పి శ్రీమతి డి.జానకి, ఐపియస్.శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి 31వ తేదీ సా
యంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!