తెలంగాణ రాజకీయ చరిత్రలో కేసీఆర్ పాత్ర అజరామరం. 2001 ఏప్రిల్ 27న 'తెలంగాణ రాష్ట్ర సమితి' (TRS) పార్టీని స్థాపించి, దశాబ్దాలుగా మరుగున పడిపోయిన ప్రత్యేక రాష్ట్ర కాంక్షను మళ్ళీ ప్రజల్లో రగిలించారు. తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి అనే ఏకైక నినాదంతో పల్లె పల్లెను తట్టి లేపారు. అనేక అవమానాలు, రాజకీయ ఒడిదొడుకులు ఎదురైనా, తన వాగ్ధాటితో ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించారు. 2004లో యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయాల్లో ప్రధాన అజెండాగా మార్చడంలో ఆయన వ్యూహం అమోఘం.తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)కు 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసిన జడ్చర్ల బీఆర్ఎస్ నాయకులు.
