బూర్గుల రామకృష్ణ రావు కళాశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్స్

బూర్గుల రామకృష్ణ రావు కళాశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్స్

TBN LIVE
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జాయింట్ డైరెక్టర్స్ ప్రొఫెసర్ పి.బాల భాస్కర్, ప్రొఫెసర్.డి. ఎస్.ఆర్. రాజేందర్ సింగ్  సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ బాల భాస్కర్  మాట్లాడుతూ ఈ కళాశాలకు బొటానికల్ గార్డెన్ మకుటంమైనది అని,ఇక్కడ చదవడం,పనిచేయటం మన అదృష్టం అని చెప్పారు.ప్రతి అధ్యాపకులు కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యంగా కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, డ్రౌపౌట్ సంఖ్యను తగ్గించాలని, మెంటార్- మెంటినీ అమలు పరచాలని సూచించారు.అలాగే రాజేందర్ సింగ్ గారు మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణలోనే ప్రత్యేక ఆకర్షణీయమైన కళాశాల అని, సదాశివయ్య ఆధ్వర్యంలో విద్యార్థులను గ్రీన్ సైనికులుగా తీర్చిదిద్ది అద్భుతంగా గార్డెన్ను తయారుచేసి తెలంగాణా లోనే మొదటిదని పేర్కొన్నారు.యన్.ఐ.ఆర్.ఫ్ లో 100 లోపల ర్యాంక్ సాధించడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. తర్వాత రాఘవేంద్ర రెడ్డి రాసిన  ప్రపంచ చరిత్ర  పుస్తకం ఆవిష్కరణ చేసి, యన్.సి.సి విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. తర్వాత బొటానికల్ గార్డెన్స్ లో మెడిసినల్ మొక్కలు నాటి ప్రతిఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, నర్మదా అకడమిక్ కో ఆర్డినేటర్ రాఘవేంద్ర రెడ్డి, బొటానికల్ గార్డెన్స్ సమన్వయ కర్త డాక్టర్ సదాశివయ్య, కంట్రోలర్ సులేమాన్, మాధురి అధ్యాపకులు పుష్పలత సూరయ జబిన్, నర్సింలు, వేణు, నరసింహ రావు,విక్రమ్,వెంకటేశ్వర్లు,వీర ప్రతాప్,విద్యార్థులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!