జడ్చర్ల మండలంలోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ లోని సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు కు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డాకల్ మండలానికి చెందిన రాజశ్రీ (32) నారాయణపేటకు చెందిన శ్యాంసుందర్ను వివాహం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గా మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామంలో
విధులు నిర్వహిస్తున్న రాజశ్రీ తన ఇద్దరు పిల్లలతో కలిసి
జడ్చర్లలో పట్టణంలోని ఏడో వార్డులో ని సరస్వతి
కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. సోమవారం
ఉదయం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపించిన రాజశ్రీ
ఇంట్లోనే చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు
పాల్పడింది. సాయంత్రం సమయంలో రాజశ్రీ భర్త రాజశ్రీ కి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఓనర్ కు శ్యాంసుందర్ రాజ్యశ్రీ ఫోన్ తీయడం లేదు అంటూ ఒకసారి చూడండి అంటూ ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ వెళ్లి చూడగా స్పందించకపోవడంతో ఇరుగు పొరుగువారు పోగయ్యి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ తరుణంలో కిటికీ లో నుంచి చూడగా రాజశ్రీ అప్పటికే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంది.
ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మల్లేష్ ఫ్యాన్ కు వేలాడుతున్న రాజశ్రీ మృతదేహాన్ని కిందకు దించారు. కాగా రాజశ్రీ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడినట్లు వాట్సాప్ లో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రాజశ్రీ ఆత్మహత్య చేసుకున్నాక ఎవరో ఇంటికి వచ్చి తలుపులు తట్టి కిటికీలో నుంచి చూసి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు సమాచారం. రాజశ్రీ ఆత్మహత్యకు కారణం ఇల్లీగల్ ఎఫైర్ ఆ లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అసలు రాజశ్రీ ఇంటి తలుపులు కొట్టి కిటికీలో నుంచి చూసి వెళ్లిపోయింది ఎవరు? అని పలువురు చర్చించుకుంటున్నారు.కాగా, రాజశ్రీ భర్త శ్యాంసుందర్ నారాయణపేట లో మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడని అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోయేవాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సిసి ఫుటేజ్ తో పాటు రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ విషయం తెలిసిన మిడ్జిల్ మండలం ఎంపీడీవో తోపాటు కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెలుగముల గ్రామంలో విధులు నిర్వహిస్తూ అందరితో ఉండే రాజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిన గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.
