గంగాపురం కొత్త మార్కెట్లో ప్రారంభించిన మక్కల కొనుగోలు

గంగాపురం కొత్త మార్కెట్లో ప్రారంభించిన మక్కల కొనుగోలు

TBN LIVE
PACS ఆధ్వర్యంలో గంగాపురం కొత్త మార్కెట్‌లో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు
రైతులకు న్యాయమైన ధరలతో మక్కల కొనుగోలు ప్రారంభం  రైతులకు సౌకర్యవంతమైన మార్కెట్వా తావరణం PACS ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి
జడ్చర్ల మండలంలోని PACS ఆధ్వర్యంలో గంగాపురం కొత్త మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని నేడు జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ — రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, రైతులు తమ పంటలకు సరైన ధర పొందే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మక్కల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించామని చెప్పారు.
రైతులు మార్కెట్ ధరలపై అవగాహన కలిగి, PACS ద్వారా నేరుగా అమ్మకాలు నిర్వహించుకోవడం వల్ల మధ్యవర్తుల దోపిడీకి అవకాశం ఉండదని అన్నారు. పంటల సేకరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం అందుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమాఖ్య ప్రతినిధులు, PACS అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!