జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఇందుకు అంతా సిద్దం అయిందని జరుగుతున్న ప్రచారంపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఇక్కడ ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చని హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మేము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వారికి గేటు వద్దకు వెళ్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకదని కావాలనే ఇలాంటి ఫలితం లేని ప్రచారాలు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు. కాగా ఎర్ర శేఖర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడే ముందు ఈ ఆలోచన చేసి ఉంటే బాగుండేది అని ఇప్పుడు మళ్లీ కాంగ్రెసులోకి రావాలనే ఆలోచన మానుకోవాలని ఈ విధంగా తెలియజేశారు.
