భోజనంలో నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవు

భోజనంలో నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవు

TBN LIVE
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి (నవాబుపేట) మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శనివారం మండల పలు గ్రామాలు పర్యటించారు. బుధవారం భారీ వర్షంల కారణాలవల్ల మండలంలో వరద ముంపునకు గురైన రుద్రారం యన్మన్ గండ్ల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరద ముంపు నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని గ్రామాల ప్రజలకు కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించి దుకాణంలో బియ్యం పంపిణీని పరిశీలించారు. చౌక ధరల దుకాణాన్ని ఎల్లప్పుడూ పరిశు భ్రంగా ఉంచుకోవాలని షాప్ డీలర్ కు సూచించారు. అనంతరం మండల పరిధిలోని యన్మనగండ్ల గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలో వసతి పొందుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పరిశీలించారు. భోజనంలో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం.. విద్యార్థినులకు భోజనం వడ్డించేందుకు హాస్టల్ వార్డెన్ బందెమ్మ పై చర్యలు తీసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!