బహుమతులను ప్రధానం చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ మెన్నం శ్రీనివాస్ రెడ్డి

బహుమతులను ప్రధానం చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ మెన్నం శ్రీనివాస్ రెడ్డి

TBN LIVE


 క్రీడలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* 
క్రీడలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు సూచించారు.  మహబూబ్ నగర్ నగరంలోని క్రీడా మైదానం లో జరిగిన  రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్ బాల్ చాంపియన్ షిప్ 2025 ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతుల ప్రదానం చేశారు.  అంతకుముందు ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ఓర్పు, పట్టుదల మరియు లక్ష్యాలను సాధించాలనే సంకల్పాన్ని మనకు నేర్పుతాయని ఆయన  పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో నిధులు కేటాయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.   రానున్న ఒలింపిక్ క్రీడలలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, రాష్ట్ర నెట్ బాల్ సంఘం  అధ్యక్షులు విక్రం ఆదిత్య, కార్యదర్శి శిరీషా రాణి, రాంమోహన్, షరిఫ్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!